సంవత్సరం ముందుగా...

Tickets to go on sale for ICC Womens T20 World Cup 2020 on one-year-to-go milestone - Sakshi

 నేటి నుంచి మహిళల టి20 ప్రపంచకప్‌ టికెట్ల అమ్మకాలు షురూ

దుబాయ్‌: మహిళల టి20 ప్రపంచ కప్‌ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సరిగ్గా ఏడాది ముందుగా మొదలు పెట్టడం విశేషం. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఫైనల్‌ సహా 23 మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌ ్ట20ఠీౌట ఛీఛిup.ఛిౌఝ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. మ్యాచ్‌ టికెట్ల కనీస ధరను 20 డాలర్లు (సుమారు రూ.1500)గా నిర్ణయించారు.

పది జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచ కప్‌ ఆస్ట్రేలియాలోని ఆరు నగరాల్లో జరుగుతుంది. ప్రధాన టోర్నీకి ముందు ఫిబ్రవరి 16నుంచి 20 వరకు వామప్‌ మ్యాచ్‌లు ఉంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మెల్‌బోర్న్‌లోని ఎంసీజీలో జరిగే ఫైనల్‌కు 92 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని ఐసీసీ అంచనా వేస్తోంది.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top