ఈ రనౌట్.. మ్యాచ్కే హైలైట్! | Temba Bavuma shows what he can do on the cricket field in 0.264 seconds | Sakshi
Sakshi News home page

ఈ రనౌట్.. మ్యాచ్కే హైలైట్!

Nov 7 2016 1:45 PM | Updated on Sep 4 2017 7:28 PM

ఈ రనౌట్.. మ్యాచ్కే హైలైట్!

ఈ రనౌట్.. మ్యాచ్కే హైలైట్!

ఆస్ట్రేలియాతో ఇక్కడ వాకా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు బావుమా అద్భుతమైన డైవ్తో చేసిన రనౌట్ మ్యాచ్ కే హైలైట్.

పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ వాకా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు బావుమా అద్భుతమైన డైవ్తో చేసిన రనౌట్ మ్యాచ్ కే హైలైట్. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఆసీస్  రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరుగు కోసం  యత్నించిన సమయంలో బావుమా బౌలర్ ఎండ్ నుంచి పరుగెత్తుకొచ్చి బంతిని అందుకున్నాడు. అంతే వేగంగా బంతిని సూటిగా వికెట్లవైపు విసిరాడు. దాంతో బెయిల్స్ కిందపడటం, వార్నర్ అవుట్ కావడం చకచకా జరిగిపోయాయి.

తొలుత వార్నర్ సులువుగా క్రీజ్లోకి వెళతాడని భావించినా.. రెప్పపాటులో బావుమా చేసిన రనౌట్ తో వార్నర్ సైతం ఆశ్చర్యపోయాడు. అయితే ఆ రనౌట్ చేయడానికి పట్టిన సమయం 0.264 సెకండ్లుగా నమోదు కావడంతో, కాసేపు తమ దేశ మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ను బావుమా జ్ఞప్తికి వచ్చాడు.


ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 177 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా విఫలమై ఓటమి పాలైంది. ఉస్మాన్ ఖవాజా(97), నేవిల్(60 నాటౌట్)రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement