తెలుగు టైటాన్స్ ఘనవిజయం | telugu titans beats bengal wariors | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్ ఘనవిజయం

Aug 5 2015 8:59 PM | Updated on Sep 3 2017 6:50 AM

తెలుగు టైటాన్స్ ఘనవిజయం

తెలుగు టైటాన్స్ ఘనవిజయం

ప్రొ కబడ్డీ లీగ్ లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్పై 44-28 తేడాతో తెలుగు టైటాన్స్ ఘనవిజయం సాధించింది.

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్పై 44-28 తేడాతో తెలుగు టైటాన్స్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి తెలుగు టైటాన్స్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి అర్ధభాగం సమయం ముగిసే వరకు 27-9 తేడాతో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ మొత్తంగా 44-28 తేడాతో బెంగాల్ వారియర్స్ను మట్టికరిపించింది.

స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సొంత అభిమానుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ తెలుగు టైటాన్స్కు అదనపు ఉత్సాహనిచ్చింది. టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ స్టేడియంలో సందడి చేశారు. తెలుగు టైటాన్స్ 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో బెంగాల్ వారియర్స్ 11 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement