రాజ్కోట్ కెప్టెన్గా రైనా | Suresh Raina to Lead Rajkot Team Gujarat Lions; Brad Hodge to be Coach | Sakshi
Sakshi News home page

రాజ్కోట్ కెప్టెన్గా రైనా

Feb 2 2016 6:11 PM | Updated on Aug 21 2018 2:28 PM

రాజ్కోట్ కెప్టెన్గా రైనా - Sakshi

రాజ్కోట్ కెప్టెన్గా రైనా

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్కు కొత్తగా వచ్చిన రెండు జట్లలో ఒకటైన రాజ్ కోట్ జట్టుకు సురేష్ రైనా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.

న్యూఢిల్లీ:ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్కు కొత్తగా వచ్చిన రెండు జట్లలో ఒకటైన రాజ్ కోట్ జట్టుకు సురేష్ రైనా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రాజ్ కోట్ జట్టుకు రైనాను సారథిగా నియమించగా, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ బ్రాడ్ హాగ్ను కోచ్ గా ఎంపిక చేశారు. అంతర్జాతీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రైనా కెప్టెన్ గా నియమించినట్లు రాజ్ కోట్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బ్రాడ్ హాగ్ కు గత ఐపీఎల్ సీజన్లలో ఆడిన అనుభవం మెండుగా ఉండటంతో అతన్ని కోచ్ గా నియమిస్తూ రాజ్ కోట్ నిర్ణయం తీసుకుంది.

 

అంతకుముందు టీమిండియా, దక్షిణాఫ్రికాల మాజీ కోచ్ గ్యారీ కిరెస్టన్ ను కోచ్ గా నియమిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. సుదీర్ఘ పరిశీలన అనంతరం బ్రాడ్ హాగ్ ను కోచ్ గా నియమిస్తున్నట్లు రాజ్ కోట్ ప్రకటించింది. ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లు రెండేళ్ల పాటు సస్పెండ్ కావడంతో రాజ్ కోట్ , పుణే జట్టులు  ఆ స్థానాలను భర్తీ చేయనున్నాయి. రాజ్ కోట్ జట్టు గుజరాత్ లయన్స్ గా  పోరుకు సన్నద్ధమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement