సురేశ్‌ రైనా సరికొత్త రికార్డు | Suresh Raina overtakes Virat Kohli with most T20 runs for India | Sakshi
Sakshi News home page

సురేశ్‌ రైనా సరికొత్త రికార్డు

Jan 23 2018 4:06 PM | Updated on Jan 23 2018 4:12 PM

Suresh Raina overtakes Virat Kohli with most T20 runs for India - Sakshi

కోల్‌కతా: గత కొంతకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న భారత బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా సరికొత్త రికార్డు సృష్టించాడు. ట్వంటీ 20 ఫార్మాట్‌లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ క్రమంలోనే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(7,068)ని వెనక్కినెట్టి తొలి స్థానాన్ని ఆక‍్రమించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో భాగంగా మంగళవారం ఈడెన్‌ గార్డెన్‌లో తమిళనాడుతో  మ్యాచ్‌లో ఉత్తరప‍్రదేశ్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రైనా ఈ ఘనతను సాధించాడు. ఈరోజు మ్యాచ్‌లో 61 పరుగులు సాధించిన రైనా 7,114 పరుగులతో అగ్రస్థానానికి ఎగబాకాడు.

నిన్న బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా (59 బంతుల్లో 126 నాటౌట్‌; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. 49 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటుకున్నాడు. దాంతో 7,053 పరుగులతో కోహ్లి రికార్డుకు దగ్గరగా వచ్చిన రైనా.. దాన్ని రోజు వ్యవధిలోనే అధిగమించడం కొత్త చరిత్ర లిఖించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement