‘దేవుడే రక్షించాడు’ | Sunil Gavaskar: When a sleepy Jaguar driver almost killed Indian legend | Sakshi
Sakshi News home page

‘దేవుడే రక్షించాడు’

Aug 13 2014 1:33 AM | Updated on Oct 3 2018 7:16 PM

‘దేవుడే రక్షించాడు’ - Sakshi

‘దేవుడే రక్షించాడు’

మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

కారు ప్రమాదంలో గవాస్కర్ సురక్షితం
లండన్: మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం నాలుగో టెస్టు ముగిసిన అనంతరం జాగ్వార్ కారులో సన్నీతో పాటు అతడి స్నేహితుడు చంద్రేశ్ పటేల్, మరో వ్యాఖ్యాత మార్క్ నికోలస్ మాంచెస్టర్ నుంచి లండన్‌కు ప్రయాణమయ్యారు. భారీ వర్షంలో వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారును ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొంది. అప్పటికీ డ్రైవర్ కారును కుడి వైపు తిప్పి ప్రమాదం నుంచి తప్పించాలనుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వెనుక సీట్లో ఎడమ వైపున గవాస్కర్ కూర్చోగా ఎదురుగా వచ్చిన వాహనం కూడా అదే వైపున ఢీకొంది.

అయితే జాగ్వార్ పూర్తిగా దెబ్బతినగా కారులో సన్నీతో పాటు ప్రయాణిస్తున్న ఇతరులు కూడా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. ఈ సమయంలో వీరి డ్రైవర్ కాస్త వేగంగానే నడుపుతుండగా వెనక నుంచి గవాస్కర్ హెచ్చరించినట్టు సమాచారం. ఆ తర్వాత షాక్‌కు గురైన వీరంతా సమీప రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి లండన్‌కు రైలులో వెళ్లారు. ‘నిజంగా మమ్మల్ని దేవుడే రక్షించాడు. ఘటన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. మా కారు కూడా చాలా వేగంగా వెళుతోంది. ప్రమాదం చాలా దారుణంగా ఉన్నా మాకెవరికీ గాయాలు కాలేదు. నేను మాత్రం షాక్‌తో వ ణికిపోయాను’ అని గవాస్కర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement