'న‌న్ను ఎందుకు ప‌క్క‌న‌బెట్టారో అర్థం కాలేదు'

 Stuart Broad Says Cant Understand Why I Dropped First Test Again Windies - Sakshi

సౌతాంప్ట‌న్‌ : దాదాపు 116 రోజుల క‌రోనా విరామం త‌ర్వాత ఇంగ్లండ్‌- విండీస్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌తో క్రికెట్ సంద‌డి మొద‌లైంది. ఈ సిరీస్‌లో మొద‌టి టెస్టుకు ఇంగ్లండ్ రెగ్యుల‌ర్ కెప్టెన్ జోరూట్ గైర్హాజ‌రీలో బెన్ ‌స్టోక్స్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే విండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టిటెస్టుకు న‌లుగురు ఫాస్ట్ బౌల‌ర్లు చాల‌నే ఉద్ధేశంతో  స్టోక్స్ ఫామ్‌లో ఉన్న స్టువ‌ర్ట్‌ బ్రాడ్‌ను కాద‌ని జోఫ్రా ఆర్చ‌ర్‌, మార్క్ఉడ్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకున్నాడు. త‌న‌తో పాటు అండ‌ర్స‌న్ క‌లిపితే జ‌ట్టుకు న‌లుగురు ఫాస్ట్ బౌల‌ర్లు స‌రిపోయార‌ని అందుకే బ్రాడ్‌ను తీసుకోలేద‌ని స్టోక్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపాడు. ఈ నిర్ణ‌యం బ్రాడ్‌నే కాదు ఇంగ్లండ్‌ అభిమానుల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.(భార‌త అభిమానుల గుండె ప‌గిలిన రోజు)

తాజాగా త‌న‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై బ్రాడ్ స్పందించాడు.' దాదాపు నాలుగు నెల‌ల విరామం త‌ర్వాత మైదానంలోకి దిగ‌బోతున్నా అనే ఉత్సాహం ఉండేది. కానీ విండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టిటెస్టుకు న‌న్ను ఎంపిక‌చేయ‌క‌పోవ‌డంతో చాలా బాధేసింది. అస‌లు న‌న్ను ఎందుకు ప‌క్క‌న పెట్టార‌న్న‌ది ఇప్ప‌టికి అర్థం కావ‌డం లేదు .నేను చాలా నిరాశ‌లో కూరుకుపోయా. మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు నన్ను ఇలా చేయ‌డం న‌చ్చ‌లేదు. మ్యాచ్‌కు ఒక‌రోజు ముందు బెన్ ‌స్టోక్స్ నా ద‌గ్గ‌రికి వ‌చ్చాడు. సౌంతాప్ట‌న్ పిచ్ పేస‌ర్ల‌కు బాగా అనుకూలిస్తుంది.. అందుకే అద‌న‌పు పేస్ బౌల‌ర్ అవ‌స‌రం ప‌డుతుంది అని చెప్పాడు. కానీ అనూహ్యంగా న‌న్ను ప‌క్క‌న‌బెట్టి జోఫ్రా ఆర్చ‌ర్‌కు అవ‌కావ‌మిచ్చారు. జోఫ్రా ఎంపిక‌పై నేను త‌ప్పు బ‌ట్ట‌ను.. ఎందుకో కానీ ఈ విష‌యాన్ని నేను జీర్ణంచుకోలేక‌పోతున్నా. ద‌శాబ్ద కాలంగా జ‌ట్టుతో పాటు కొన‌సాగుతున్నా.. ఈ ద‌శాబ్ద కాలంలో ఇంగ్లండ్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించా. క‌రోనాకు ముందు జ‌రిగిన యాషెస్ సిరీస్‌, ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అద్భ‌తంగా బౌలింగ్ చేశా. కానీ ఫామ్‌లో ఉన్న బౌల‌ర్‌ని ప‌క్క‌న బెట్ట‌డం న‌చ్చ‌లేదు. అందుకే ఈ విష‌యంలో నాకు కోపంతో పాటు విసుగు వ‌చ్చింది.' అంటూ ఇంగ్లండ్ వెటెర‌స్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఈ విష‌యంపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ డారెన్ గాఫ్ స్పందించాడు. విండీస్‌తో టెస్టుకు బ్రాడ్‌ను ఎంపిక‌చేయ‌క‌పోవడం త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని గాఫ్ పేర్కొన్నాడు. ‌‌నిజానికి స్టువ‌ర్ట్ బ్రాడ్‌ క‌రోనాకు ముందు ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌ననే న‌మోదు చేశాడు. ప్రొటీస్‌తో జ‌రిగిన సిరీస్‌లో 14 వికెట్ల‌తో రాణించాడు. అంత‌కముందు 2019 యాషెస్ సిరీస్‌లో పాట్ క‌మిన్స్‌(28 వికెట్లు) త‌ర్వాత అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా బ్రాడ్(23 వికెట్లు) నిలిచాడు. కాగా స్టువ‌ర్ట్ బ్రాడ్ త‌న కెరీర్‌లో 138 టెస్టులాడి 485 వికెట్లు ప‌డ‌గొట్టాడు.('కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వ‌లేదు')

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top