‘స్మిత్‌ను మిస్‌ కావడం లేదు’ | Steve Smith As A Batsman Will Not Be Missed In IPL 2018,Bharucha | Sakshi
Sakshi News home page

‘స్మిత్‌ను మిస్‌ కావడం లేదు’

Apr 2 2018 11:47 AM | Updated on Apr 7 2018 9:44 PM

Steve Smith As A Batsman Will Not Be Missed In IPL 2018,Bharucha - Sakshi

స్టీవ్‌ స్మిత్‌(ఫైల్‌ఫొటో)

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా త్వరలో ఆరంభమయ్యే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ దూరమైన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా త్వరలో ఆరంభమయ్యే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతన్ని మిస్‌ కావడం లేదని అంటున్నాడు రాజస్తాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ హెడ్‌ జుబిన్‌ బారుచా.  ఆటగాడిగా స్మిత్‌ సేవల్ని తమ జట్టు కోల్పోతున్నప్పటికీ, ఒక బ్యాట్స్‌మన్‌గా మాత‍్రం స్మిత్‌ను మిస్‌ కావడం లేదని అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. అతని లేని లోటును పూడ‍్చడానికి చాలా మంది నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని,  అలా స్మిత్‌ స్థానాన్ని జట్టు భర్తీ చేసుకుంటుందన్నాడు. దాంతో బ్యాట్స్‌మన్‌గా స్మిత్‌ తమతోనే ఉన్నట్లు భావిస్తామన్నాడు.

స్మిత్‌ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెస్‌ తీసుకోబోతున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు సంబంధించి జరిగిన వేలంలో ఆల్‌ రౌండర్ల బ్యాకప్‌ కోసమే తాము అన్వేషించిన విషయాన్ని బారుచా  ఈ సందర్భంగా తెలిపాడు. తమ జట్టులో ఆల్‌ రౌండర్ల కొరత ఎక్కువగా ఉందని భావించే వేలంలో వారికి ప‍్రాముఖ్యత ఇచ్చామన్నాడు. ఇప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌ సమతుల్యంగా ఉందని, దాంతో ఏ ఒక్క ప్లేయర్‌ని మిస్‌ అవుతున్నామన్న భావన రాదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement