సెమీస్‌లో సౌజన్య జోడీ | Sowjanya in Semis of ITF Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సౌజన్య జోడీ

Mar 1 2019 10:12 AM | Updated on Mar 1 2019 10:12 AM

Sowjanya in Semis of ITF Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సౌజన్య భవిశెట్టి రాణిస్తోంది. టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి పెట్రా జనుస్కోవా (కెనడా)తో కలిసి సౌజన్య డబుల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరుకుంది.

గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సౌజన్య (భారత్‌)– పెట్రా జనుస్కోవా (కెనడా) ద్వయం 4–6, 6–3, 10–7తో సకురా హొసోజి (జపాన్‌)–డెనిజ్‌ (టర్కీ) జంటపై గెలుపొంది సెమీస్‌లో అడుగు పెట్టింది. మరోవైపు సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సౌజన్య 2–6, 6–3, 2–6తో క్రిస్టినా మిలెన్‌కోవిచ్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement