వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యం కాకపోవడంతో... న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా
డ్యునెడిన్: వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యం కాకపోవడంతో... న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఐదో రోజు ఆదివారం కనీసం ఒక్క బంతి ఆట కూడా సాధ్యంకాలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 224 పరుగులు చేసింది. 191 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
చివరి రోజు వేగంగా స్కోరు చేసి న్యూజిలాండ్‌కు ఊరించే లక్ష్యం ఇచ్చి... ఫలితం కోసం ప్రయత్నించాలని దక్షిణాఫ్రికా భావించినా వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు.