సెమీస్‌లో సోలంకి ఓటమి | Solanki defeated in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సోలంకి ఓటమి

Aug 25 2014 12:14 AM | Updated on Sep 2 2017 12:23 PM

యూత్ ఒలింపిక్స్ పురుషుల బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి సెమీస్‌లో చిత్తయ్యాడు. ఆదివారం నాన్‌జింగ్‌లో జరిగిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్ పోరులో సోలంకి 0-3 తేడాతో పింగ్ లూ(చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు.

యూత్ ఒలింపిక్స్ బాక్సింగ్
నాన్‌జింగ్: యూత్ ఒలింపిక్స్ పురుషుల బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి సెమీస్‌లో చిత్తయ్యాడు. ఆదివారం నాన్‌జింగ్‌లో జరిగిన 52 కేజీల ఫ్లయ్ వెయిట్  పోరులో సోలంకి 0-3 తేడాతో పింగ్ లూ(చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీఫైనల్లో ఏ దశలోనూ ప్రత్యర్థితో పోటీపడలేకపోయిన సోలంకి సోమవారం జరిగే కాంస్య పతక పోరులో మహ్మద్ అలీ (గ్రేట్ బ్రిటన్)తో తలపడనున్నాడు. ఇక ఇతర క్రీడాంశాల్లో భారత్‌కు చెందిన క్రీడాకారులు నిరాశపరిచారు.
 
పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్ కుమార్ వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసినప్పటికీ ‘ఎ’ ఫైనల్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. రేసును అజయ్ 3 నిమిషాల 46.92 సెకన్లలో పూర్తి చేసినా ఆఫ్రికా రన్నర్ల ముందు నిలవలేకపోయాడు. మహిళల జావెలిన్ త్రోలో పుష్పా జకార్ నేడు ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో పుష్ప వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి రెండవ యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటిదాకా ఒకే ఒక రజత పతకం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement