ఆసీస్ క్రికెటర్ స్మిత్ అరుదైన రికార్డు | Smith joins cricketing greats with fourth straight Test ton | Sakshi
Sakshi News home page

ఆసీస్ క్రికెటర్ స్మిత్ అరుదైన రికార్డు

Jan 7 2015 12:56 PM | Updated on Sep 2 2017 7:21 PM

ఆసీస్ క్రికెటర్ స్మిత్ అరుదైన రికార్డు

ఆసీస్ క్రికెటర్ స్మిత్ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో స్మిత్ వరుసగా నాలుగో సెంచరీ సాధించాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డు సాధించాడు. భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో స్మిత్ వరుసగా నాలుగో సెంచరీ సాధించాడు. ఒకే సిరీస్లో వరుసగా నాలుగు టెస్టుల్లోనూ సెంచరీలు బాదిన మూడో బ్యాట్స్మన్గా ఆసీస్ కెప్టెన్ రికార్డులకెక్కాడు. తద్వారా స్మిత్ బ్యాటింగ్ దిగ్గజాలు బ్రాడ్మన్, గ్రేట్ కలిస్ సరసన నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం బ్రాడ్మన్, సౌతాఫ్రికా గ్రేట్ కలిస్ ఇదే ఫీట్ నమోదు చేశారు. తాజా సిరీస్ నాలుగో టెస్టులో రెండో రోజు బుధవారం సెంచరీ బాదిన స్మిత్ (117).. ఈ సిరీస్లో అడిలైడ్ టెస్టులో (162 నాటౌట్), బ్రిస్బేన్ మ్యాచ్లో (133), మెల్బోర్న్ టెస్టులో (192) శతకాలు బాదాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement