వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏడో క్రికెటర్‌గా..

Shoaib Malik gets special ODI double - Sakshi

బులవాయో: ఒకవైపు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు యువ సంచలనం ఫఖర్‌ జమాన్‌ వరుస రికార్డులతో బిజీగా ఉంటే,  ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ సైతం అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఏడు వేల పరుగుల మార్కును చేరిన ఎనిమిదో పాకిస్తాన్‌ ఆటగాడిగా మాలిక్‌ గుర్తింపు సాధించాడు. తద్వారా మరో  ఘనతను కూడా మాలిక్‌ నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో ఏడు వేల పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు సాధించిన ఏడో క్రికెటర్‌గా మాలిక్‌ నిలిచాడు. అదే సమయంలో ఈ ఫీట్‌ సాధించిన రెండో పాకిస్తాన్‌ క్రికెటర్‌గా మాలిక్‌ రికార్డు పుస్తకాల్లోకికెక్కాడు.

ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో వన్డేలో మాలిక్‌ ఏడు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్‌ 18 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు వన్డే ఫార్మాట్‌లో ఏడు వేలకు పైగా పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు సాధించిన వారిలో స్టీవ్‌ వా, సచిన్‌ టెండూల్కర్‌, జయసూర్య. కల్లిస్‌, ఆఫ్రిది, క్రిస్‌ గేల్‌లు ఉన్నారు.

చదవండి: పాకిస్తాన్‌ క్లీన్‌ స్వీప్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top