మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్ | shoaib akhtar married to 20 year old girl | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్

Jun 26 2014 10:12 AM | Updated on Sep 2 2017 9:26 AM

మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్

మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరో ఇంటివాడయ్యాడు.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరో ఇంటివాడయ్యాడు. అవును.. ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలోని హరిపూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయిని షోయబ్ నిఖా చేసుకున్నాడు. రుబాబ్ అనే ఈ అమ్మాయితో అత్యంత రహస్యంగా హరిపూర్లోనే అక్తర్ నిఖా అయ్యిందన్న విషయాన్ని పాకిస్థాన్కు చెందిన దునియా టీవీ వెల్లడించింది. హక్ మహర్ కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించారని, అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లికి అక్తర్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారని ఆ టీవీ చెప్పింది.

వాస్తవానికి అక్తర్ తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు తొలుత కథనాలు వచ్చినా, వాటన్నింటినీ ట్విట్టర్ ద్వారా తీవ్రంగా ఖండించాడు. కానీ ఈనెల 12వ తేదీన అక్తర్ కుటుంబం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి, పెళ్లి విషయాన్ని ఖరారు చేసుకుందని అక్తర్కు సన్నిహిత వర్గాలు పీటీఐకి తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement