హుమేరా శుభారంభం  | Sheikh Humera started win the game | Sakshi
Sakshi News home page

హుమేరా శుభారంభం 

Oct 3 2018 12:43 AM | Updated on Oct 3 2018 12:43 AM

Sheikh Humera started win the game - Sakshi

న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి షేక్‌ హుమేరా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో హుమేరా 7–6 (8/6), 0–6, 6–3తో ప్రతిభ నారాయణ్‌ (కర్ణాటక)పై గెలిచింది. అండర్‌–18 బాలికల సింగిల్స్‌లో హుమేరా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్‌లో హుమేరా 6–1, 6–0తో చావి రాఠి (హరియాణా)ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన సామ సాత్విక, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి కొండవీటి అనూష రెండో రౌండ్‌కు చేరారు. తొలి రౌండ్‌లో సాత్విక 6–1, 6–1తో వన్షిత (కర్ణాటక)పై, అనూష 2–6, 7–5, 6–0తో ఆర్తి ముణియన్‌ (తమిళనాడు)పై గెలిచారు.

అండర్‌–18 బాలికల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 6–2, 6–2తో సుదీప్త (మహారాష్ట్ర)పై, లక్ష్మి సాహితి రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌) 6–2, 6–2తో పూజ ఇంగ్లే (మహారాష్ట్ర)పై నెగ్గారు. స్మృతి భాసిన్‌ (తెలంగాణ) 1–6, 4–6తో త్రిషా వినోద్‌ (కేరళ) చేతిలో... సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 2–6, 5–7తో ఫర్హత్‌ కమర్‌ (రాజస్తాన్‌) చేతిలో... భక్తి షా (తెలంగాణ) 1–6, 5–7తో కశిష్‌ భాటియా (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు అండర్‌–18 బాలుర సింగిల్స్‌ రెండో రౌండ్‌లో తీర్థ శశాంక్‌ (తెలంగాణ) 6–4, 6–2తో అథర్వ శర్మ (మహారాష్ట్ర)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.    

Advertisement
 
Advertisement
Advertisement