breaking news
womens singles titles
-
హుమేరా శుభారంభం
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో హుమేరా 7–6 (8/6), 0–6, 6–3తో ప్రతిభ నారాయణ్ (కర్ణాటక)పై గెలిచింది. అండర్–18 బాలికల సింగిల్స్‌లో హుమేరా మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్లో హుమేరా 6–1, 6–0తో చావి రాఠి (హరియాణా)ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన సామ సాత్విక, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కొండవీటి అనూష రెండో రౌండ్‌కు చేరారు. తొలి రౌండ్లో సాత్విక 6–1, 6–1తో వన్షిత (కర్ణాటక)పై, అనూష 2–6, 7–5, 6–0తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)పై గెలిచారు. అండర్–18 బాలికల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 6–2, 6–2తో సుదీప్త (మహారాష్ట్ర)పై, లక్ష్మి సాహితి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6–2, 6–2తో పూజ ఇంగ్లే (మహారాష్ట్ర)పై నెగ్గారు. స్మృతి భాసిన్ (తెలంగాణ) 1–6, 4–6తో త్రిషా వినోద్ (కేరళ) చేతిలో... సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 2–6, 5–7తో ఫర్హత్ కమర్ (రాజస్తాన్) చేతిలో... భక్తి షా (తెలంగాణ) 1–6, 5–7తో కశిష్ భాటియా (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు అండర్–18 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–2తో అథర్వ శర్మ (మహారాష్ట్ర)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. -
చాంప్స్ అర్చన, హకీమ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ క్యారమ్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను అర్చన (ఆర్బీఐ) కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎం.ఎ.హకీమ్ (బీఎస్ఎన్ఎల్) చేజిక్కించుకున్నాడు. హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఏజీ ఆఫీస్ రిక్రియేషన్ క్లబ్లో ముగిసిన ఈ పోటీల్లో సోమవారం జరిగిన మహిళల వ్యక్తిగత సింగిల్స్ ఫైనల్లో అర్చన 24-13, 25-7 స్కోరుతో సుజని (21సెంటినరీ)పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అపరంజిత రాణి(ఎన్పీసీ) 19-13, 24-11తో నిరుప (ఏపీ ట్రాన్స్‌కో)పై గెలిచింది. సెమీస్‌లో అర్చన 20-15, 25-17తో అపరంజితపై, సుజని 4-25, 24-10, 22-14తో నిరుపపై గెలిచింది. పురుషుల వ్యక్తిగత సింగిల్స్ ఫైనల్లో ఎం.ఎ.హకీమ్ 24-18, 20-25, 25-5తో వి.అనిల్ కుమార్ (ఏజీఓఆర్‌సీ)పై గెలిచాడు. మూడో స్థానం మ్యాచ్‌లో ఆర్.డి.దినేష్ బాబు (ఏజీఓఆర్‌సీ) 25-8, 25-8తో వి.ఎస్.కె.నాయుడు (ఆర్బీఐ)పై నెగ్గాడు. ఈ పోటీల విజేతలకు ఆర్బీఐ అంబుడ్స్‌మన్ ఎన్.కృష్ణమోహన్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు బి.కె.హరనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్.మదన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.