సెంచరీ దిశగా షేన్ వాట్సన్, ఆసీస్ 121/2 | Shane Watson hammers new-look England | Sakshi
Sakshi News home page

సెంచరీ దిశగా షేన్ వాట్సన్, ఆసీస్ 121/2

Aug 21 2013 6:35 PM | Updated on Sep 1 2017 9:59 PM

యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి ఐదవ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి ఐదవ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. లంచ్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.  జట్టు స్కోరు 11 పరుగులు ఉండగా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్ లో ఓపెనర్ వార్నర్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోజర్స్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
 
అయితే ఆతర్వాత క్రీజులో వచ్చిన షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ ను ఆరంభించి మూడవ సెంచరీ సాధించే దిశగా ఆటను కొనసాగిస్తున్నాడు. వాట్సన్ 84 పరుగులతో, క్లార్క్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. స్వాన్, అండర్సన్ లకు చెరో వికెట్ లభించింది. ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement