ప్రత్యూషకు రెండో గెలుపు | second win for pratyusha | Sakshi
Sakshi News home page

ప్రత్యూషకు రెండో గెలుపు

Nov 3 2014 1:09 AM | Updated on Jul 12 2019 6:04 PM

ప్రత్యూషకు రెండో గెలుపు - Sakshi

ప్రత్యూషకు రెండో గెలుపు

సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష రెండో విజయాన్ని నమోదు చేసింది.

సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కె.లక్ష్మీ ప్రణీతతో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ప్రత్యూష 47 ఎత్తుల్లో గెలిచింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి హిందూజా రెడ్డికి ఏడో ఓటమి ఎదురైంది.

మేరీ ఆన్ గోమ్స్ (బెంగాల్)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌లో హిందూజా 36 ఎత్తుల్లో పరాజయాన్ని చవిచూసింది. ఎనిమిదో రౌండ్ తర్వాత పద్మిని రౌత్ (ఒడిశా) ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రత్యూష నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. 11 రౌండ్లపాటు జరిగే ఈ టోర్నీలో మరో మూడు రౌండ్‌లు మిగిలి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement