సెమీస్‌లో శశాంక్‌ | Sashank In Semis of Asian Tennis Tour | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శశాంక్‌

Apr 27 2019 3:29 PM | Updated on Apr 27 2019 3:29 PM

 Sashank In Semis of Asian Tennis Tour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా టెన్నిస్‌ టూర్‌ ర్యాంకింగ్‌ పురుషుల టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ముంబై వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో మాచెర్ల తీర్థ శశాంక్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో శశాంక్‌ 1–6, 7–6 (8/6), 6–2తో నాలుగో సీడ్‌ చంద్రిల్‌ సూద్‌పై విజయం సాధించాడు.

తొలి సెట్‌లో ప్రత్యర్థికి తేలిగ్గా తలొంచిన శశాంక్‌ రెండో సెట్‌లో అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. పాయింట్‌ పాయింట్‌కు పోరాడి టైబ్రేక్‌లో రెండో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. అదే ఉత్సాహంతో మూడో సెట్‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఇక్బాల్‌తో శశాంక్‌ తలపడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement