సెమీస్‌లో శశాంక్‌ | Sashank in Semis of AITA Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శశాంక్‌

Jan 10 2019 10:01 AM | Updated on Jan 10 2019 10:01 AM

Sashank in Semis of AITA Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్‌ నిలకడగా రాణిస్తున్నాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన శశాంక్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్‌ (తెలంగాణ) 6–4, 6–4తో గుహన్‌ రాజన్‌ (తమిళనాడు)పై విజయం సాధించాడు. నేడు జరుగనున్న సెమీస్‌లో టాప్‌ సీడ్‌ పీసీ విఘ్నేశ్‌తో శశాంక్‌ ఆడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement