సానియా జంటకు నిరాశ | sania mirza loss the game | Sakshi
Sakshi News home page

సానియా జంటకు నిరాశ

Mar 16 2017 12:09 AM | Updated on Sep 5 2017 6:10 AM

సానియా జంటకు నిరాశ

సానియా జంటకు నిరాశ

ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా (భారత్‌) –బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లోనే

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సానియా  మీర్జా (భారత్‌) –బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. సానియా–స్ట్రికోవా ద్వయం 4–6, 4–6తో మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)–యుంగ్‌ జాన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన సానియా–స్ట్రికోవా జంటకు 48,010 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 31 లక్షల 52 వేలు) లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement