సానియా–గార్సియా జోడీ శుభారంభం

దుబాయ్: కాలి పిక్క గాయం నుంచి తేరుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)–కరోలినా గార్సియా (ఫ్రాన్స్) ద్వయం 6–4, 4–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలా కుద్రయెత్సెవా (రష్యా)–కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటను ఓడించింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)–బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్) జోడీతో సానియా–గార్సియా జంట ఆడుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి