ముగిసిన సానియా పోరు | Sania Mirza-Barbora Strycova knocked out of women's doubles | Sakshi
Sakshi News home page

ముగిసిన సానియా పోరు

Sep 8 2016 12:25 AM | Updated on Sep 4 2017 12:33 PM

ముగిసిన సానియా పోరు

ముగిసిన సానియా పోరు

యూఎస్ ఓపెన్‌లో ఈసారి భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది.

యూఎస్ ఓపెన్‌లో ఈసారి భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఇప్పటికే నిష్ర్కమించగా... వారి సరసన సానియా మీర్జా కూడా చేరింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండో రౌండ్‌లో ఓడిన సానియా... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో  పరాజయం పాలైంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సానియా-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-7 (3/7), 1-6తో టాప్ సీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్‌‌స) జోడీ చేతిలో ఓడిపోరుుంది.

69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోరుున ఇండో-చెక్ జంట రెండో సెట్‌లో మాత్రం చేతులెత్తేసింది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి లియాండర్ పేస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో... సానియా మహిళల డబుల్స్‌లో టైటిల్స్ సాధించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement