టెన్నిస్ దిగ్గ‌జం పేస్ ఇంట్లో విషాదం | Leander Paes-Mother Olympian Jennifer Paes-Dies At Age-72 | Sakshi
Sakshi News home page

టెన్నిస్ దిగ్గ‌జం పేస్ ఇంట్లో విషాదం

May 18 2026 9:32 PM | Updated on May 18 2026 10:36 PM

Leander Paes-Mother Olympian Jennifer Paes-Dies At Age-72

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పేస్ తల్లి, మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి జెన్నిఫర్ పేస్ (72) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. జెన్నిఫర్ 1972 మ్యూనిచ్ ఒలింపి క్స్‌లో భారతదేశానికి బాస్కెట్‌బాల్‌లో ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1982లో బాస్కెట్‌ బాల్‌ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహ రించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

జెన్నిఫర్ పేస్ ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్‌కు స్వయానా ముని మనుమరాలు. 2025 ఆగస్టులో పేస్ తండ్రి వేస్ పేస్ మృతి చెందిన విషయం తెలిసిందే.  వేస్ పేస్ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1971 హాకీ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో వేస్ పేస్ సభ్యుడిగా ఉన్నారు. 

ఆ తర్వాతి ఏడాది 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులోనూ మిడ్‌ఫీల్డర్‌గా సేవలందించాడు. ఇద్దరు దిగ్గజాల కడుపున పుట్టిన లియాండర్ పేస్ టెన్నిస్‌లో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో భారత టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేస్ రికార్డులకెక్కాడు. 

ఇక 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో 10 మిక్స్‌డ్ టైటిల్స్‌, 8 డబుల్స్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ కాంస్యం సాధించి తండ్రి తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఆటగాడిగా పేస్ ఖ్యాతిని గడించాడు.

చదవండి: ధోనీ రిటైర్మెంట్‌పై రుతురాజ్ క్లారిటీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement