ధోనీ రిటైర్మెంట్‌పై రుతురాజ్ క్లారిటీ! | CSK Captain Ruturaj Gaikwad Clarifies MS Dhoni IPL Future | Sakshi
Sakshi News home page

ధోనీ రిటైర్మెంట్‌పై రుతురాజ్ క్లారిటీ.. అదొక్క‌టే ఊర‌ట‌!

May 18 2026 8:12 PM | Updated on May 18 2026 10:00 PM

CSK Captain Ruturaj Gaikwad Clarifies MS Dhoni IPL Future

Photo Courtesy: IPL 2026

సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ప్ర‌స్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్ప‌ష్ట‌త‌నిచ్చాడు. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌ సోమ‌వారం చెన్నైలోని సొంత మైదానంలో ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ధోనీ ఆడుతాడ‌ని అభిమానులు ఆశించారు. టాస్ సమ‌యంలో ధోనీ ఆడుతున్నాడా లేదా అని ర‌విశాస్త్రి అడిగిన ప్ర‌శ్న‌కు రుతురాజ్ స‌మాధాన‌మిచ్చాడు. 

ఎంఎస్ ధోనీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేద‌ని, ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ఆడ‌డం లేద‌ని తెలిపాడు. దీంతో అభిమానుల ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌యింది. అయితే ధోనీ మ్యాచ్ ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ జ‌ట్టుతో పాటు చెపాక్ స్టేడియానికి రావడం అభిమానులకు ఊరట కలిగించే అంశం. ఎటూ ధోనీ మ్యాచ్ ఆడ‌డం లేదు కాబ‌ట్టి ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ముగిసిన అనంత‌రం సైలెంట్‌గా స్టేడియంలోకి వ‌చ్చి అభివాదం చేస్తూ సీఎస్‌కేకు గుడ్‌బై చెబుతాడేమోన‌ని అభిమానులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. 

త‌మ అభిమాన క్రికెట‌ర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌కుండా ఇలా సైలెంట్‌గా రిటైర్ అవ్వ‌డాన్ని తాము భ‌రించ‌లేమ‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఒక‌వేళ ధోనీ ఇవాళ త‌న రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌కపోతే మాత్రం మే 21 వ‌ర‌కు ఆగాల్సిందే. ఇక సొంత గ్రౌండ్‌లో చివ‌రి మ్యాచ్ ఆడుతున్న సీఎస్‌కే మే 21న గుజ‌రాత్ టైటాన్స్‌తో ఈ సీజ‌న్‌లో చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడ‌నుంది.

దీంతో అహ్మ‌దాబాద్‌లోనే ధోనీకి సీఎస్‌కే ఘ‌నంగా సెండాఫ్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరితే అప్పటిక‌ప్పుడు ప్ర‌ణాళిక‌ల‌ను మార్చేందుకు సీఎస్‌కే యాజ‌మాన్యం సిద్ధ‌మ‌వుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement