క్వార్టర్స్కు దూసుకెళ్లిన సానియా, బోపన్న | Sania and Bopanna pair in Rio quarterfinals of mixed doubles | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్కు దూసుకెళ్లిన సానియా, బోపన్న

Aug 12 2016 12:18 PM | Updated on Sep 4 2017 9:00 AM

క్వార్టర్స్కు దూసుకెళ్లిన సానియా, బోపన్న

క్వార్టర్స్కు దూసుకెళ్లిన సానియా, బోపన్న

రియో ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న జోడీ శుభారంభం చేసింది.

రియో ఒలింపిక్స్‌లో టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న జోడీ శుభారంభం చేసింది.  తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్‌, పీర్స్‌ జాన్‌ జోడీపై శుక్రవారం వేకువజామున జరిగిన పోరులో 7-5, 6-4 తేడాతో వరుస సెట్లలో సానియా, బోపన్న ద్వయం విజయం సాధించింది.

రెండు సెట్లలోనూ ఆసీస్ జోడీ పోరాడినా సరైన సమయాలలో అనవసర తప్పిదాలకు దూరంగా ఉన్న భారత ద్వయాన్నే విజయం వరించింది. ఈ విజయంతో సానియా, బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పురుషులు డబుల్స్ లో బోపన్న, పేస్ జోడీ, మహిళల డబుల్స్ లో సానియా జోడీ నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement