మనమే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: సచిన్‌ | Sachin Tendulkar terms India favourites for World Cup 2019 | Sakshi
Sakshi News home page

మనమే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: సచిన్‌

Feb 4 2019 12:27 PM | Updated on May 29 2019 2:38 PM

Sachin Tendulkar terms India favourites for World Cup 2019 - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది మేలో ఇంగ్లండ్‌ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియానే ఫేవరెట్‌ అనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ అన్నాడు. ఆ మెగా టోర్నీలో కఠినమైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది భారత క్రికెట్‌ జట్టేనని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌పై వారి దేశంలో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలిచిన భారత జట్టుపై ప్రశంలస వర్షం కురిపించాడు. ప‍్రస్తుతం ఏ దేశంలోనైనా, ఏ పిచ్‌పై అయినా టీమిండియా సత్తాచాటుతుందన్నాడు.

‘టీమిండియా వరుస విజయాల రికార్డు పరిగణనలోకి తీసుకుని నేను చెప్పడం లేదు. ప్రస్తుతం టీమిండియా జట్టు కూర్పు అద్భుతంగా ఉంది. ఈ కూర్పు ఈ జట్టు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఎక్కడైనా పోటీపడగలదు. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శనలు చూస్తుంటే ఇంగ్లండ్‌లో జరుగనున్న ప్రపంచకప్ టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరెట్ అని చెబుతున్నా’ అని సచిన్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement