చెస్ చాంప్స్ సారుు రుషి, శ్రీశాంతి | rushi and sri shanti won state chess championship | Sakshi
Sakshi News home page

చెస్ చాంప్స్ సారుు రుషి, శ్రీశాంతి

Aug 27 2016 10:30 AM | Updated on Sep 4 2017 11:10 AM

తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా చెస్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ చిన్నారులు సారుురుషి, శ్రీశాంతి ఎంపికయ్యారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా చెస్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ చిన్నారులు సారుురుషి, శ్రీశాంతి ఎంపికయ్యారు. వీరిరువురూ హైదరాబాద్ జిల్లా అండర్-7 చెస్ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచారు. హైదరబాద్ జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ఓపెన్ కేటగిరీ చివరి రౌండ్ గేమ్‌లో సారుు రుషి (4)... ప్రణషు గుప్తా (2.5)పై, కృష్ణచరణ్ (3)... సూర్య అఖిల్ (2)పై గెలుపొంది తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

 

బాలికల కేటగిరీలో శ్రీశాంతి (3.5)... రిమితా రెడ్డి (2.5)పై, అభిజ్ఞ (2.5)... దుర్గ కార్తీక (2)పై విజయం సాధించారు. అగ్రస్థానంలో నిలిచిన సారుు రుషి, శ్రీశాంతి సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యే రాష్ట్ర స్థారుు చెస్ టోర్నమెంట్‌లో పాల్గొంటారు. ఈ టోర్నమెంట్ దోమలగూడలోని ఏవీ కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement