ఎప్‌సెట్‌ టాపర్‌కు ‘మెగా’ సర్‌ప్రైజ్‌ | Chiranjeevi Makes TG Eapcet Topper Rushi Dream Come True | Sakshi
Sakshi News home page

ఎప్‌సెట్‌ టాపర్‌కు ‘మెగా’ సర్‌ప్రైజ్‌

May 20 2026 5:08 PM | Updated on May 20 2026 5:40 PM

Chiranjeevi Makes TG Eapcet Topper Rushi Dream Come True

తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి మెగాసార్‌ స్టార్‌ చిరంజీవి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పరీక్షల ముందు ఆమెకు తండ్రి ఓ మాట ఇస్తే.. దాన్ని మెగాసార్ట్‌ నిజం చేశారు. అభిమాన హీరో ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి రుషితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాకవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. అసలు తండ్రి ఇచ్చిన మాటేంటి? చిరంజీవి చేసిన సర్‌ప్రైజ్‌ ఏంటి?

చిరంజీవి కోసం ఫస్ట్‌ ర్యాంకు
తెలంగాణ ఎప్‌సెట్‌కు సన్నద్దమవుతున్న సమయంలో ‘స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధిస్తే మెగాస్టార్‌తో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆమె కష్టపడి చదివి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. ఈ విషయం చిరంజీవికి తెలియడంతో, ఆ యంగ్ అచీవర్‌ను స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని సన్మానించారు.

ల్యాప్‌టాప్ బహుమతి
బుధవారం ఉదయం రుషి ఫ్యామిలీని చిరంజీవి ఇంటికి పిలిపించుకున్నారు. తన నివాసానికి వచ్చిన రుషిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కష్టపడి చదివి టాపర్‌గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను స్వయంగా కలుసుకుని సత్కారం అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement