ఓహ్‌.. వాటే సిక్స్‌.. ఆ సిక్సర్‌ను చూస్తూ బిత్తరపోయిన కోహ్లి! | Rohit Sharma's Six That Left Virat Kohli AMAZING | Sakshi
Sakshi News home page

ఓహ్‌.. వాటే సిక్స్‌.. ఆ సిక్సర్‌ను చూస్తూ బిత్తరపోయిన కోహ్లి!

Oct 30 2017 5:09 PM | Updated on Oct 30 2017 6:32 PM

Rohit Sharma's Six That Left Virat Kohli AMAZING

కాన్పూర్‌ : న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరోసారి చెలరేగి.. అద్భుతమైన సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ (147), కెప్టెన్‌ విరాట్‌  కోహ్లి (113)లు దూకుడుగా ఆడి సెంచరీలు చేయడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ న్యూజిలాండ్‌కు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని విసిరిన సంగతి తెలిసిందే. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చివర్లో తడబడ్డ కివీస్‌ ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ ధాటిగా సాగింది. భారీ షాట్లతో అతను కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఆడం మిల్నే వేసిన పదో ఓవర్‌లో రోహిత్‌ కొట్టిన సిక్స్‌ అద్భుతం. గంటకు 85 మీటర్ల వేగంతో వేసిన ఈ బంతిని రోహిత్‌ అమాంతం భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆకాశంలో దూసుకుపోయిన ఈ బంతిని అలా చూస్తూ ఉండిపోయిన కోహ్లి సైతం విస్మయపోయాడు.. వాటే సిక్స్‌ అన్న తరహాలో కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్‌ను కెమెరాలు స్పష్టంగా పసిగట్టాయి. రోహిత్‌ సిక్సర్‌.. దానికి కోహ్లి విస్మయకర హవాభావాలతో కూడిన వీడియోను నెటిజన్లు షేర్‌చేసుకొని కామెంట్లు పెడుతున్నారు.

రోహిత్‌ కొట్టిన భారీ సిక్స్‌ వీడియో 

ఈ మ్యాచ్‌లోని రికార్డులివి..

7
గతేడాది జూన్‌ నుంచి భారత్‌ వరుసగా నెగ్గిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల సంఖ్య. జింబాబ్వే (3–0), న్యూజిలాండ్‌ (3–2), ఇంగ్లండ్‌ (2–1), విండీస్‌ (3–1), శ్రీలంక (5–0), ఆస్ట్రేలియా (4–1), న్యూజిలాండ్‌ (2–1)లపై వరుసగా సిరీస్‌లను నెగ్గింది.

4
రోహిత్, కోహ్లి జోడీ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం నాలుగోసారి. వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జోడీ ఇదే.  

20
అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా కోహ్లి చేసి సెంచరీల సంఖ్య. పాంటింగ్‌ (41), స్మిత్‌ (దక్షిణాఫ్రికా, 33) ముందు వరుసలో ఉన్నారు.

1460
ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో కెప్టెన్‌గా కోహ్లి చేసిన పరుగులివి. పాంటింగ్‌ (2007లో 1424) రికార్డును తుడిచిపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement