ఈ ఇద్దరు ఏం చేస్తారో?

Rohit and Dhawan did not run in partnership for some time - Sakshi

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌–ధావన్‌. కానీ, కొంతకాలంగా ఇద్దరి భాగస్వామ్యంలో పరుగులు రావడం లేదు. రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ (శిఖర్‌ 2, 1, రోహిత్‌ 2, 19) విఫలమయ్యారు. వ్యక్తిగతంగా ధావన్‌ ఫర్వాలేకున్నా, ఐపీఎల్‌ సహా రోహిత్‌ ఫామ్‌ పేలవంగా ఉంది. కీలక మ్యాచ్‌ల్లో వీరి రాణింపుపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఐసీసీ టోర్నీల్లో ధావన్‌ నిలకడగా ఆడతాడు. రోహిత్‌ ఊపులోకి రావడానికి ఒక్క మ్యాచ్‌ చాలు. వీరిద్దరూ ఇక్కడే జరిగిన గత రెండు చాంపియన్స్‌ ట్రోఫీల్లో దుమ్మురేపిన నేపథ్యంలో తిరిగి లయ అందుకుంటారని ఆశించవచ్చు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top