రోహిత్‌ ఎట్‌ 500 | Rohit At 500 Plus Runs Against South Africas Series | Sakshi
Sakshi News home page

రోహిత్‌ ఎట్‌ 500

Oct 20 2019 11:30 AM | Updated on Oct 20 2019 11:40 AM

Rohit At 500 Plus Runs Against South Africas Series - Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన బ్యాటింగ్‌లో సత్తా చాటుకుంటున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా పనికి రావన్న విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ 500కు పైగా పరుగులు సాధించాడు. దాంతో ఒక సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన ఐదో భారత్‌ ఓపెనర్‌గా అరుదైన ఘనతను నమోదు చేశాడు.

అంతకుముందు వినోద్‌ మన్కడ్‌, బుద్ధి కుందిరేన్‌, సునీల్‌ గావస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఒక టెస్టు సిరీస్‌లో ఐదు వందలపైగా సాధించిన భారత ఓపెనర్లు కాగా, ఇప్పుడు వారి సరసన రోహిత్‌ చేరాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో  180 పైగా పరుగులు సాధించిన తర్వాత రోహిత్‌ ఈ మార్కును చేరాడు.  తొలి టెస్టులోనే 303 పరుగులు సాధించిన రోహిత్‌.. రెండో టెస్టులో 14 పరుగులు చేశాడు. దాంతో ఒక్క సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించాడు. ప్రస్తుతం రోహిత్‌ డబుల్‌ సెంచరీకి చేరువగా నిలిచాడు.ఇక నాల్గో వికెట్‌గా రహానే(115; 192 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియన్‌ చేరాడు. రోహిత్‌తో కలిసి 267 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రహానే ఔటయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement