రన్నరప్‌ బోపన్న జంట | Rohan Bopanna depression | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ బోపన్న జంట

Mar 5 2017 1:14 AM | Updated on Sep 5 2017 5:12 AM

రన్నరప్‌ బోపన్న జంట

రన్నరప్‌ బోపన్న జంట

నాలుగోసారి దుబాయ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు నిరాశ ఎదురైంది.

దుబాయ్‌: నాలుగోసారి దుబాయ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మట్కోవ్‌స్కీ (పోలాండ్‌) జంటకు ఓటమి ఎదురైంది.

79 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌)–హŸరియా టెకావ్‌ (రొమేనియా) ద్వయం 4–6, 6–3, 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో బోపన్న–మట్కోవ్‌స్కీ జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. రోజర్‌–టెకావ్‌ జంటకు 1,57,570 డాలర్లు (రూ. కోటీ 5 లక్షలు), బోపన్న–మట్కోవ్‌స్కీ జోడీకి 77,140 డాలర్లు (రూ. 51 లక్షల 46 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement