ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కునిగా..

 RCBs Prayas Ray Barman Becomes Youngest Player to Debut in IPL - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మరో యువ క్రికెటర్‌ అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ప్రయాస్‌ రే బర్మన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కునిగా ఈ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రయాస్‌ బర్మన్‌ 16 ఏళ్ల 157 రోజుల వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.
(ఇక్కడ చదవండి: కేన్‌ విలియమ్సన్‌ ఔట్‌)

దాంతో ఇప్పటివరకూ ముజిబ్‌ ఉర్‌ రహ్మన్‌ పేరిట ఉన్న రికార్డును ప్రయాస్‌ సవరించాడు. ముజిబ్‌ ఉర్‌ 17 ఏళ్ల 11 రోజుల వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రయాస్‌, ముజిబ్‌ ఉర్‌ తర్వాత స్థానాల్లో సర్ఫరాజ్‌ ఖాన్‌(17 ఏళ్ల 177 రోజులు), ప్రదీప్‌ సంగ్వాన్‌(17 ఏళ్ల 179 రోజులు), వాషింగ్టన్‌ సుందర్‌(17 ఏళ్ల 199 రోజులు)లు వరుసగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

Liveblog - ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కునిగా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top