కోల్పోయిన అవకాశం మళ్లీ దక్కింది! | RCB announce Harpreet Singh as replacement | Sakshi
Sakshi News home page

కోల్పోయిన అవకాశం మళ్లీ దక్కింది!

Apr 21 2017 1:14 AM | Updated on Sep 5 2017 9:16 AM

కోల్పోయిన అవకాశం మళ్లీ దక్కింది!

కోల్పోయిన అవకాశం మళ్లీ దక్కింది!

ఫిబ్రవరి 20న ఐపీఎల్‌ వేలం జరిగిన రోజు ఒక యువ క్రికెటర్‌ తప్పతాగి రైల్వే ప్లాట్‌ఫాంపైకి కారును తీసుకెళ్లిన

బెంగళూరు: ఫిబ్రవరి 20న ఐపీఎల్‌ వేలం జరిగిన రోజు ఒక యువ క్రికెటర్‌ తప్పతాగి రైల్వే ప్లాట్‌ఫాంపైకి కారును తీసుకెళ్లిన ఘటన జరిగింది. ఈ ఘటనకు కారకుడు ముంబైకి చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ హర్మీత్‌ సింగ్‌ కాగా... మీడియా మాత్రం మధ్యప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ ఫోటోను చూపిస్తూ రోజంతా వార్తను నడిపింది. ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో 211 పరుగులతో సెంట్రల్‌ జోన్‌ టాపర్‌గా నిలిచి ఐపీఎల్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్న హర్‌ప్రీత్‌పై దీని ప్రభావం పడింది. మంచి ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో గతంలో రెండు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఉన్నా, పోలీసు కేసు అతని ఎంపికపై తీవ్ర ప్రభావం చూపించింది.

అప్పటికే యాక్సిడెంట్‌ గురించి విన్న ఐపీఎల్‌ జట్ల యాజమాన్యాలు హర్‌ప్రీత్‌ను పట్టించుకోలేదు. మీడియా అత్యుత్సాహం తన అవకాశాలు దెబ్బ తీసిందంటూ అతను తీవ్ర ఆవేదన చెందాడు. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం కలిసొచ్చింది. గాయపడిన సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో బెంగళూరు జట్టు హర్‌ప్రీత్‌ను తీసుకోవడంతో అతనికి మరో అవకాశం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement