breaking news
Harmeet Singh
-
తప్పించుకున్న ఆప్ ఎమ్మెల్యే
పటియాలా: పంజాబ్‌లోని అధికార ఆప్‌కు చెందిన ఎమ్మెల్యే నాటకీయ పరిణామాల నడుమ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడం సంచలనంగా మారింది. అత్యాచారం కేసు కావడంతో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపైకి ఆయన అనుచరులు తుపాకులతో కాల్పులు జరుపుతూ, రాళ్లు రువ్వారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నారు. హరియాణాలోని కర్నాల్ జిల్లా దబ్రి గ్రామంలోని నివాసంలో ఉన్న హర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకునేందుకు మంగళవారం పటియాలా పోలీసు బృందం అక్కడికి చేరుకుంది.అనంతరం పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యేను తరలిస్తుండగా కొందరు గ్రామస్తులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతోపాటు కాల్పులకు దిగారు. ఇదే అదనుగా ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. స్కార్పియో వాహనంలో ఎమ్మెల్యే తప్పించుకునే క్రమంలో ఓ పోలీసుపైకి వాహనాన్ని డ్రైవ్ చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరుడు బల్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని మూడు తుపాకులు, ఫార్చునర్ కారును స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారయ్యేందుకు ఎమ్మెల్యే వాడిన వాహనాన్ని అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు నమ్మించి, తనతో హర్‌ప్రీత్ సింగ్ సంబంధం కొనసాగించాడని జిరాక్ పూర్‌కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. అనంతరం 2021లో పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్ చిత్రాలు చూపుతూ బెదిరిస్తున్నట్లు ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై రేప్, మోసం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ఇటీవల పలు ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కల్పించిన వ్యక్తిగత భద్రతను సైతం ఉపసంహరించుకుంది. -
కోల్పోయిన అవకాశం మళ్లీ దక్కింది!
బెంగళూరు: ఫిబ్రవరి 20న ఐపీఎల్ వేలం జరిగిన రోజు ఒక యువ క్రికెటర్ తప్పతాగి రైల్వే ప్లాట్‌ఫాంపైకి కారును తీసుకెళ్లిన ఘటన జరిగింది. ఈ ఘటనకు కారకుడు ముంబైకి చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్మీత్ సింగ్ కాగా... మీడియా మాత్రం మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ హర్‌ప్రీత్ సింగ్ ఫోటోను చూపిస్తూ రోజంతా వార్తను నడిపింది. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 211 పరుగులతో సెంట్రల్ జోన్ టాపర్‌గా నిలిచి ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న హర్‌ప్రీత్‌పై దీని ప్రభావం పడింది. మంచి ఆల్‌రౌండ్ నైపుణ్యంతో గతంలో రెండు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఉన్నా, పోలీసు కేసు అతని ఎంపికపై తీవ్ర ప్రభావం చూపించింది. అప్పటికే యాక్సిడెంట్ గురించి విన్న ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు హర్‌ప్రీత్‌ను పట్టించుకోలేదు. మీడియా అత్యుత్సాహం తన అవకాశాలు దెబ్బ తీసిందంటూ అతను తీవ్ర ఆవేదన చెందాడు. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం కలిసొచ్చింది. గాయపడిన సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో బెంగళూరు జట్టు హర్‌ప్రీత్‌ను తీసుకోవడంతో అతనికి మరో అవకాశం దక్కింది. -
గర్ల్ ఫ్రెండ్స్ ను షేర్ చేసుకుంటాం!
ముంబై: మీట్ బ్రదర్స్.. బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ కు ఆ పేరు సుపరిచితమే. మీట్ బ్రదర్స్ గా పేరుగాంచిన సోదరులు రిమిక్స్ పాటలతో హల్ చల్ చేస్తున్నారు. నిజానికి వీరు సోదరులు కానప్పటికీ మన్ మీత్ సింగ్, హర్మీత్ సింగ్ మీట్ బ్రోస్ గా మారి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుంటారు. బాలీవుడ్ లో వీరిదో వింతశైలి అని చెప్పవచ్చు. కొన్ని విషయాలలో మాత్రమే తమ నిర్ణయాలు వేరుగా ఉంటాయని, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా మేము షేర్ చేసుకున్నామని వారు అంటున్నారు. జీవితంలో ఏది శాశ్వతంగా ఉండవని అది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. వీరు ఎవరి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకోలేదట. జోగి సింగ్ బర్నాలా వీరి టాలెంట్ ను వెలుగులోకి తెచ్చాడు. ఈ మీట్ బ్రదర్స్ ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. బేబీ డాల్, హై హీల్స్ లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న వీరు చాలా విషయాలలో ఒకే తీరుగా ప్రవర్తిస్తామని పేర్కన్నారు. వీరికి వ్యాపార నేపథ్యం కుటుంబం. ఓ బ్యాడ్ సింగర్ తమ కెరీర్ కు ఓ రూపునిచ్చాడని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మేం ఇద్దరు స్నేహితులం. బ్రదర్స్ అవ్వాల్సిన పనిలేదని అభిప్రాయమని చెప్పారు. మన్మీత్ ఓపిక చాలా ఎక్కవని, తనకు కోపం త్వరగా వస్తుందని హర్మీత్ చెప్పుకొచ్చాడు. కాలేజీ రోజుల్లో మొత్తం 16 రకాల పేర్లను అనుకుని చివరగా మీట్ బ్రదర్స్ పేరు ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు.