మాకు అతనే ప్రధాన బలం: కోహ్లి

Ravindra Jadeja Is A Key Player In Our Team, Kohli - Sakshi

హైదరాబాద్‌:  టీ20ల్లో ప్రయోగాలు కొనసాగుతాయని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి స్పష్టం చేశాడు. రేపు(శుక్రవారం) ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో తొలి టీ20 జరుగనున్న నేపథ్యంలో కోహ్లి ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు.  ప్రస్తుతం టీమిండియా జట్టు చాలా పటిష్టంగా ఉందన్న కోహ్లి.. టీ20ల్లో ర్యాంకింగ్స్‌ను పట్టించుకోవడం లేదన్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో ఈ ఫార్మాట్‌లో ప్రయోగాలను కొనసాగిస్తామన్నాడు.(ఇక్కడ చదవండి: ‘1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు’)

ఇక రిషభ్‌ పంత్‌ పదే పదే వైఫల్యం చెందడంపై కోహ్లి మాట్లాడుతూ.. రిషభ్‌ పంత్‌ ప్రతిభపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. అతను తప్పకుండా గాడిలో పడతాడని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20ల్లో తక్కువ స్కోరింగ్‌ మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు. సరైన జట్టుతో విండీస్‌తో పోరుకు సిద్ధమవుతున్నామన్న కోహ్లి..ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాను తమ జట్టుకు ప్రధాన బలమన్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జడేజా కీలక ఆటగాడిగా కోహ్లి అభిప్రాయపడ్డాడు.(ఇక్కడ చదవండి: టాప్‌ నీదా.. నాదా: కోహ్లి వర్సెస్‌ రోహిత్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top