సెమీస్‌లో ముంబై మహారథి | Pro-wrestling league-2 | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ముంబై మహారథి

Jan 14 2017 1:03 AM | Updated on Sep 5 2017 1:11 AM

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో ముంబై మహారథి జట్టు సెమీస్‌కు చేరింది.

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో ముంబై మహారథి జట్టు సెమీస్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు 4–3 తేడాతో ఢిల్లీ సుల్తాన్స్‌పై గెలుపొందింది. ముంబైతోపాటు ఇప్పటికే హరియాణా, జైపూర్, పంజాబ్‌ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ సీజన్‌లో ఢిల్లీ, యూపీ దంగల్‌ జట్లు ఆడిన నాలుగేసి మ్యాచ్‌ల్లో ఓడిపోయి సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.

ముంబై జట్టులో హసనోవ్‌ (74 కేజీలు), వికాస్‌ (65 కేజీలు), ఎరీకా వీబ్‌ (75 కేజీలు), పావ్లో ఓలియ్‌నిక్‌ (97 కేజీలు) గెలిచారు. ఢిల్లీ జట్టులో డేవిడ్‌  (70 కేజీలు), మరియా స్టడ్‌నిక్‌ (48 కేజీలు), సాక్షి మలిక్‌ (58 కేజీలు) విజయం సాధించారు. శనివారం జరిగే పోరులో హరియాణా హ్యామర్స్‌ జట్టు జైపూర్‌ నింజాస్‌తో తలపడుతుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement