ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ జట్టు ‘బ్లాక్‌ హాక్స్‌’ | Pro Volleyball League ready to take flight | Sakshi
Sakshi News home page

ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ జట్టు ‘బ్లాక్‌ హాక్స్‌’

Nov 27 2018 1:32 AM | Updated on Nov 27 2018 1:32 AM

Pro Volleyball League ready to take flight - Sakshi

తొలిసారి నిర్వహించనున్న ప్రొ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌)లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీకి సంబంధించిన వివరాలను లీగ్‌ సీఈఓ జాయ్‌ భట్టాచార్య సోమవారం ప్రకటించారు. హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్, చెన్నై స్పార్టన్స్, యు ముంబా వాలీ, అహ్మదాబాద్‌ డిఫెండర్స్, కాలికట్‌ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్‌ పేర్లతో ఆరు టీమ్‌లు బరిలోకి దిగనున్నాయి.

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) టీమ్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ యజమానులే ప్రొ వాలీబాల్‌ హైదరాబాద్‌ టీమ్‌ను కూడా కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు చెన్నై, కొచ్చిలలో ఈ టోర్నీ జరుగుతుంది.  ఒక్కో జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు. డిసెంబర్‌ 13, 14 తేదీల్లో వేలం జరుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement