తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌ | Pro Kabaddi 2019 Patna Pirates Beat Tamil Thalaivas | Sakshi
Sakshi News home page

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

Jul 29 2019 9:11 PM | Updated on Jul 29 2019 9:12 PM

Pro Kabaddi 2019 Patna Pirates Beat Tamil Thalaivas - Sakshi

ముంబై : దబాంగ్‌ ఢిల్లీపై విజయంతో మంచి జోరు మీదున్న తమిళ్‌ తలైవాస్‌కు  పట్నా పైరేట్స్‌ షాక్‌ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క పాయింట్‌ తేడాతో తమిళ్‌ తలైవాస్‌ జట్టు ఓటమి చవిచూసింది. ఆ జట్టు స్టార్‌ రైడర్లు రాహుల్‌ చౌదరి(5) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ.. సారథి అజయ్‌ ఠాకూర్‌(1)లు పూర్తిగా నిరాశపరిచాడు. సోమవారం ముంబై ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళ్‌ జట్టు 23-24 తేడాతో పట్నాపై పోరాడి ఓడిపోయింది. 

ఇరుజట్టు ఆది నుంచి ఆచితూచి ఆడాయి. దీంతో పాయింట్లు సాధించడం కష్టంగా మారింది. తొలి అర్దభాగం ముగిసే సరికి 11-11తో సమంగా నిలిచాయ. అయితే రెండో అర్దభాగం మొదట్లో తమిళ్‌ జట్టు పొరపాట్లు చేయడంతో మూల్యం చెల్లించుకుంది. ఇక చివర్లో తమిళ్‌ జట్టు పోరాడినప్పటికీ అదృష్టం కలిసిరాక ఓటమిచవిచూసింది. పట్నా స్టార్‌ రైడర్‌, సారథి పర్‌దీప్‌ నర్వాల్‌(1)ను కట్టడి చేసిన తమిళ్‌ ఢిఫెండర్లు.. జైదీప్‌(7)ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇక ఈ మ్యాచ్‌లో పట్నా 7 రైడ్‌, 17 టాకిల్‌ పాయింట్లను సాధించగా.. తమిళ్‌ తలైవాస్‌ 9 రైడ్‌, 10 టాకిల్‌ పాయింట్లను సాధించింది. ఇరుజట్లు చెరో నాలుగు ఎక్సట్రా పాయింట్లను సాధించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement