వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం గెలిచిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం గెలిచిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ తో సైనా చిరస్మరణీయ విజయం సాధించిందని మోదీ కొనియాడారు. ఆమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు.
మలేసియాలో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సైనా నెహ్వాల్ రజత పతకం దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో ఓడిపోయి సిల్వర్ పతకంతో సరిపెట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ లో ఫైనల్ కు చేరి భారత తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా ఆమె ఖ్యాతి దక్కించుకుంది.