రషీద్‌ ఖాన్‌పై మోదీ ప్రశంసలు | PM Modi lauds Rashid Khan | Sakshi
Sakshi News home page

రషీద్‌ ఖాన్‌పై మోదీ ప్రశంసలు

Jun 24 2018 1:28 PM | Updated on Mar 28 2019 6:10 PM

PM Modi lauds Rashid Khan - Sakshi

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ క్రికెట్‌కు రషీద్‌ ఒక అరుదైన సంపదగా మోదీ అభివర్ణించారు. మన్‌కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ.. ఇటీవల ఆ దేశ క్రికెట్‌ జట్టు భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన విషయాన్ని ప్రస్తావించారు. ఇది ఇరు దేశాలు గర్వించే అంశంగా పేర్కొన్నారు. ఈ క‍్రమంలోనే రషీద్‌ ఖాన్‌ను కొనియాడారు. వరల్డ్‌ క్రికెట్‌కు రషీద్‌ ఒక విలువైన ఆస్తిగా పేర్కొన్నారు. ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌-11 సీజన్‌లో రషీద్‌ రాణించడాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement