పట్నా పైరేట్స్‌ గెలుపు | Patna Pirates Beat Dabang Delhi | Sakshi
Sakshi News home page

పట్నా పైరేట్స్‌ గెలుపు

Nov 16 2018 1:45 AM | Updated on Nov 16 2018 1:45 AM

Patna Pirates Beat Dabang Delhi - Sakshi

ముంబై: ‘డుబ్కీ’ కింగ్‌ ప్రదీప్‌ నర్వాల్‌ (16 పాయింట్లు) చెలరేగడంతో పట్నా పైరేట్స్‌ ఆరో విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 38–35తో దబంగ్‌ ఢిల్లీపై గెలుపొందింది. ప్రదీప్‌తో పాటు మన్‌జీత్‌ 8 పాయింట్లతో రాణించాడు.
 

దబంగ్‌ ఢిల్లీ తరఫున నవీన్‌ కుమార్‌ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 36–22తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో బెంగాల్‌ వారియర్స్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో యూపీ యోధా తలపడనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement