క్వార్టర్స్‌లో కశ్యప్‌ | Parupalli Kashyap enters Korea Open Badminton quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో కశ్యప్‌

Sep 27 2019 3:04 AM | Updated on Sep 27 2019 3:04 AM

Parupalli Kashyap enters Korea Open Badminton quarterfinals - Sakshi

ఇంచియోన్‌ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం 56 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్‌ 21–17, 11–21, 21–12తో డారెన్‌ ల్యూ (మలేసియా)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో  కశ్యప్‌ 15–10తో ఆధిక్యంలో నిలిచినా డారెన్‌ పోరాడటంతో స్కోరు 18–17కు చేరింది. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించి కశ్యప్‌ గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో ఒక దశలో డారెన్‌ వరుసగా 12 పాయిం ట్లు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్‌ మళ్లీ పుంజుకున్నాడు.  12–2తో ఆధిక్యంలో నిలిచిన హైదరాబాదీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement