పాకిస్థాన్‌కు భారీ ఆధిక్యం | Pakistan to a huge lead | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు భారీ ఆధిక్యం

Oct 25 2014 1:27 AM | Updated on Sep 2 2017 3:19 PM

పాకిస్థాన్‌కు భారీ ఆధిక్యం

పాకిస్థాన్‌కు భారీ ఆధిక్యం

డేవిడ్ వార్నర్ (174 బంతుల్లో 133; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి సెంచరీ సాధించినా..

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు  డేవిడ్ వార్నర్ సెంచరీ
 
 దుబాయ్: డేవిడ్ వార్నర్ (174 బంతుల్లో 133; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి సెంచరీ సాధించినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 151 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సమర్పించుకుంది. మ్యాచ్ రెండో రోజు 113/0తో పటిష్ట స్థితిలో కనిపించిన ఆసీస్, మూడో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది.  వరుసగా మూడు టెస్టు ఇన్నింగ్స్‌లలో వార్నర్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.

బ్రాడ్‌మన్ శకం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. 2005లో గిల్‌క్రిస్ట్ ఇలాగే వరుసగా మూడు శతకాలు బాదాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా  38 పరుగులు చేసి... ఓవరాల్‌గా 189 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement