శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను గెలుచుకున్న పాకిస్థాన్ తన టెస్టు ర్యాంకింగ్స్ ను మరింత మెరుగుపర్చుకుంది.
దుబాయి: శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను గెలుచుకున్న పాకిస్థాన్ తన టెస్టు ర్యాంకింగ్స్ ను మరింత మెరుగుపర్చుకుంది. శ్రీలంకతో సిరీస్ ను పాకిస్థాన్ క్రికెట్ జట్టు 2-1 తేడాతో కైవశం చేసుకోవడంతో తన ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి చేరింది. శ్రీలంకతో సిరీస్ కు ముందు ఆరో స్థానంలో ఉన్న పాకిస్థాన్.. మూడు స్థానాలు ఎగబాకింది.
	మంగళవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో  పాకిస్థాన్ 101 పాయింట్లు సాధించి మూడో స్థానానికి చేరింది.  అప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న న్యూజిలాండ్(99 పాయింట్లు)ను పాక్ వెనక్కు నెట్టింది.
	
	టెస్టు ర్యాంకింగ్ లో  పాయింట్ల వివరాలు ఇలా ఉన్నాయి..
	
	1 దక్షిణాఫ్రికా- 130
	2. ఆస్ట్రేలియా-111
	3. పాకిస్థాన్-101
	4. న్యూజిలాండ్-99
	5.టీమిండియా-97
	6. ఇంగ్లండ్ 97
	7.శ్రీలంక-92
	8. వెస్టిండీస్-81
	9. బంగ్లాదేశ్-41
	10. జింబాబ్వే-5

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
