లవ్‌ ఆఫ్‌ క్రికెట్‌.. జాయ్‌ ఆఫ్‌ క్రికెట్‌..! | A Pair In Kerala Enjoys Backyard Cricket | Sakshi
Sakshi News home page

లవ్‌ ఆఫ్‌ క్రికెట్‌.. జాయ్‌ ఆఫ్‌ క్రికెట్‌..!

Apr 28 2020 1:38 PM | Updated on Apr 28 2020 1:46 PM

A Pair In Kerala Enjoys Backyard Cricket - Sakshi

తిరువనంతపురం:  మన దేశంలో క్రికెట్‌ ప్రేమికులు ఎక్కువనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ దొరికితే చాలు బ్యాట్‌కు, బంతికి పని చెబుతారు మనోళ్లు. ఇక్కడ చిన్నా పెద్దా అనే తేడాలు కూడా ఏమీ ఉండవు. గల్లీ క్రికెట్‌ను ఆస్వాదించడంలో తమకు తామే సాటి అన్నట్లు మురిసిపోతారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ  ఇంటా-బయటా క్రికెట్‌లో మునిగి తేలుతున్నారు.(7 ఏళ్లకే బ్యాటింగ్‌ ఇరగదీస్తోంది..)

తాజాగా ఓ జంట క్రికెట్‌ను ఎంజాయ్‌ చేసిన తీరు ముచ్చటగొలుపుతోంది. కేరళ రాష్ట్రంలోని పల్కడ్‌ జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్న బిందు ఒజూకిల్‌ భర్త రామన్‌ నంబూద్రితో కలిసి ఇంటి వద్దనే ఉన్న పెరటినే క్రికెట్‌ ఫీల్డ్‌గా చేసుకున్నారు. తాము ఎవరికీ తక్కువ  కాదన్నట్లు అటు బౌలింగ్‌తో ఇటు బ్యాటింగ్‌తో అలరించారు.వీరితో పాటు వారి పిల్లలు కూడా ఇలా క్రికెట్‌ ఆడేసుకున్నారు. ‘లవ్‌  ఆఫ్‌ క్రికెట్‌.. జాయ్‌ ఆఫ్‌ క్రికెట్’‌ అన‍్నంతగా ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement