
సఫారీ బౌలర్ రబడాపై వేటు!
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడాపై సస్పెన్షన్ వేటు పడింది.
లండన్:దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడాపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రబడా సస్పెండ్ కు గురయ్యాడు. గురువారం తొలి రోజు ఆటలో భాగంగా తన బౌలింగ్ లో స్టోక్స్ అవుటైన తరువాత రబడా దూకుడుగా ప్రవర్తించాడు.
స్టోక్స్ ఫీల్డ్ ను విడిచి వెళ్లే క్రమంలో రబడా అసభ్య పదజాలంతో దూషించాడు. ఇది ఐసీసీ నియమావళిని ఉల్లంఘించడం కావడంతో రబడాపై చర్యలు తీసుకుంది. గడిచిన 24 నెలల్లో రబడా నాలుగు డీమెరిట్ పాయింట్లను సాధించడంతో అతన్ని ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశారు. మరొకవైపు మ్యాచ్ ఫీజులు 15 శాతం జరిమానాను రబడాకు విధించారు.