ఒమన్‌ ఓపెన్‌ టీటీ టోర్నీ రన్నరప్‌ అర్చన  | Oman Open Tatti Tournament runnerup Archana | Sakshi
Sakshi News home page

ఒమన్‌ ఓపెన్‌ టీటీ టోర్నీ రన్నరప్‌ అర్చన 

Mar 24 2019 1:25 AM | Updated on Mar 24 2019 1:25 AM

Oman Open Tatti Tournament runnerup Archana - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఒమన్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అర్చన కామత్‌ రన్నరప్‌గా నిలిచింది. మస్కట్‌లో శనివారం జరిగిన అండర్‌–21 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అర్చన 7–11, 8–11, 6–11తో ఒడో సాత్సుకి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్‌ ఫైనల్లో అర్చన 11–7, 11–5, 11–8తో గోయ్‌ రుయ్‌ జువాన్‌ (సింగపూర్‌)పై, సెమీఫైనల్లో 6–11, 5–11, 11–2, 11–6, 11–9తో మరియా తైలకోవా (రష్యా)పై గెలిచింది.    
 

Advertisement
 
Advertisement
Advertisement