జొకోవిచ్‌ భారీ విరాళం

Novak Djokovic's Generous Donation To Virus Fight - Sakshi

బెల్‌గ్రేడ్‌(సెర్బియా): ప్రపంచ టెన్నిస్‌ నంబర్‌వన్‌, సెర్బియా స్టార్ నోవాక్‌ జొకోవిచ్‌ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు తాను కూడా సిద్ధం అని ముందుకొచ్చాడు. ఇప్పటికే ఎంతోమంది క్రీడాకారులు తమ వంతు సహాయానికి సిద్ధం కాగా, జొకోవిచ్‌ కూడా ఆ బాటలోనే నడిచాడు. తన వంతు సాయంగా 1.1 మిలియన్‌ డాలర్లు(రూ. 8.28 కోట్లు) విరాళాన్ని ప్రకటించాడు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్య పరికరాలు, శానిటరీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇంత మొత్తాన్ని సెర్బియా ప్రభుత్వానికి విరాళం ఇచ్చినట్టు జోకర్‌(ముద్దుగా పిలుచుకుని పేరు) తెలిపాడు. (కష్టకాలంలో క్రీడాకారుల ఔదార్యం)

కరోనా వైరస్‌  విజృంభిస్తుండటంతో  దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మార్బెల్లాలో గడుపుతున్న జొకో.. వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాడు.  తన దేశంతో పాటు ప్రపంచంలో కరోనాతో బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశాడు. అంతా త్వరలోనే కోలుకోవాలని జొకో ఆకాంక్షించాడు. అంతా ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహకరించడమే కాకుండా, వైద్య నిపుణులకు కూడా సహకరించాలని పేర్కొన్నాడు.

కోవిడ్‌–19 విలయ తాండవం చేస్తోన్న నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్, బార్సిలోనా ఫార్వర్డ్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ, మాంచెస్టర్‌ సిటీ మేనేజర్‌ పెప్‌ గార్డియోలా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మహ \మ్మారి నియంత్రణ కోసం చెరో పది లక్షల యూరో లు (రూ. 8.32 కోట్లు) చొప్పున విరాళం ఇచ్చారు. ఇక మరో టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తన దేశంలో కరోనా  ముప్పు పొంచి ఉన్న కుటుంబాలకు సాయం చేయడానికి ముందుకు వచ్చా డు. తన భార్య మిర్కాతో కలిసి 10 లక్షల స్విస్‌ ఫ్రాంక్స్‌ను (రూ. 7 కోట్ల 86 లక్షలు)  అందజేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు కరోనా వైరస్‌పై పోరాటానికి తమ వంత సాయాల్ని ప్రకటిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు.  (సచిన్‌ విరాళం రూ. 50 లక్షలు )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top